హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కుడా చైర్మన్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మర్రి యాదవ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.





